Congress Bus Yatra in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర ఈరోజే మొదలవనుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కలిసి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అన్నాచెల్లెళ్ళు మధ్యాహ్నం 3.30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో రామప్ప ఆలయానికి చేరుకుంటారు. టెంపుల్లో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రామప్ప గడి (Ramappa Temple) నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలవుతుంది. అక్కడ ఇనుంచి ములుగు (Mulugu) జిల్లాకు వెళతారు. అక్కడ బహిరంగసభలో మహిళలతో రాహుల్, ప్రియాంకలు భేటీ అవుతారు.
Also Read:గాజా ఆసుపత్రిలో పేలిన బాంబు, 500మంది మృతి
Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర
తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. బాగా ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం బస్సు యాత్రలు చేసేందుకు రెడీ అయింది. బస్సు యాత్రను కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మొదలుపెట్టనున్నారు. మూడురోజుల పాటూ 8 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగుతుంది.

Translate this News:











