పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Ponguleti Srinivasa Reddy) కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ వైపు 15 సీట్లను తాను ప్రతిపాదించిన వారికి ఇవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తుంటే.. ఏకంగా ఆయన సీటుకే ఎసరు పెట్టింది హైకమాండ్. పొంగులేటి పోటీకి సిద్ధం అవుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పొంగులేటిని పోటీ చేయించాలన్నది కాంగ్రెస్ హైకమండ్ ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎం పొత్తు దాదాపుగా కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: CM KCR: ఇక రంగంలోకి కేసీఆర్.. సెంటిమెంట్ గా అక్కడ తొలి మీటింగ్!
Telangana Congress: పొంగులేటికి భారీ షాక్.. ఆయనతో పాటు అనుచరుడి సీటు కూడా గల్లంతు!
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన టికెట్ ఆశిస్తున్న కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చి ఆయనను ఖమ్మం నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్ హైమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రధాన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లుకు కూడా పినపాక టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు.

Translate this News:











