Telangana Elections: తెలంగాణ ప్రజలు త్వరలోనే శుభవార్త వింటారని మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్(BRS) మేనిఫెస్టోను ప్రకటించనున్నారని తెలిపారు. బుధవారం నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారని, అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త వింటారని తెలిపారు మంత్రి. తెలంగాణలో అభివృద్ధి లేదంటే.. సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లేనని వ్యా్ఖ్యానించారు. ఈ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఆడపడుచులు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ రోజు మంచినీళ్లు పట్టుకునే ప్రతి ఆడ పడుచు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రూ. 2 వేలు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి అవ్వకు కేసీఆర్ పెద్ద కొడుకులాగా కనిపిస్తారని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.
పూర్తిగా చదవండి..Minister Harish Rao: త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, అందుకు అనుగుణంగా త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారన్నారు.

Translate this News:











