Chief Minister’s Breakfast Scheme in Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మరో కీలక పథకాన్ని ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు(Students) సంబంధించి ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్ సర్కార్.. ఇప్పుడు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్.. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా.. అక్టోబర్ 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10 వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ‘‘ ముఖ్యమంత్రి అల్పాహార పథకం ( Chief Minister’s Breakfast Scheme) అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
పూర్తిగా చదవండి..Telangana: మరో కీలక పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్..
విద్యార్థులకు మంచి బోధనతో పాటు.. ఆరోగ్యకరమైన పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. అలాగే, ఈ పథకం ద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం.

Translate this News:











