సోషల్ మీడియా యుగం వచ్చాకా ప్రతి ఒక్కరి చేతికి మొబైల్ ఫోన్ వచ్చేసింది. అయితే చాలామంది తమ ఫోన్ పట్ల అజాగ్రత్త వహించి ఎక్కడో ఓ చోట ఫోన్ పోగొట్టుకుంటారు. ఆ తర్వాత ఆ ఫోన్ ఆచూకి కోసం అనేక తిప్పలు పడుతుంటారు. చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా అది దొరికే ఛాన్స్ ఉండొచ్చు లేకపోవచ్చు. అలాగే చాలావరకు దొంగలు కూడా రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోని ఫోన్స్ కొట్టేస్తుంటారు. అయితే పోగొట్టుకున్న, దొంగతనాలు చేసిన ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ సీఐడీ పోలీసులు మొదటిస్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు.189 రోజుల్లోనే పొగొట్టుకున్న, చోరీకి 10,018 మొబైల్ ఫోన్లను సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ టాప్
పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ సీఐడీ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. 189 రోజుల్లోనే 10,018 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రికార్డు క్రియేట్ చేశారు . మొబైల్ ఫోన్లను కనిపెట్టేందుకు అమల్లోకి తీసుకొచ్చిన సీఈఐఆర్ పోర్టల్ విధానం సత్ఫలితాలనిస్తోందని పోలీసులు చెబుతున్నారు.

Translate this News:











