తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Telangana Elections Schedule) విడుదలైంది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, ముగింపు, పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) జరగనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. రాజస్థాన్ లో 23న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఛత్తీస్ ఘడ్ లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 7, 17 తేదీల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3నే కౌంటింగ్ నిర్వహించనున్నారు.
పూర్తిగా చదవండి..TS Elections 2023 Schedule: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న ఎన్నికలు.. ఇతర డేట్స్ ఇవే!
తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలను నిర్వహిచనున్నట్లు వెల్లడించింది. ఇతర రాష్ట్రాలకు వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరగనున్నా.. అన్ని రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3నే వెల్లడించనున్నారు.

Translate this News:












