దొడ్డి కొమురయ్య సొంతూరులో ఘనంగా వర్ధంతి ఉత్సవాలు
భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనంనేని సాంబశివరావు, ప్రజా గాయకురాలు విమలక్కతో కలిసి దొడ్డి కొమురయ్య సొంతూరు అయినటువంటి కడవెండి గ్రామంలో మంగళవారం డప్పు చప్పుళ్ల మధ్య ఘనంగా ఆవిష్కరించారు.












