తెలంగాణ, ఏపీలో దసరా సెలవులకు (Dasara Holidays) ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ విషయానికి వస్తే.. అక్టోబర్ 13వ తేదీ నుంచి దసరా సెలవులు (Telangana Dasara Holidays) ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు 25వ తేదీ వరకు మొత్తం 13 రోజులు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంకా.. స్కూల్ విద్యార్థులకు ఎస్ఏ-1 ఎగ్జామ్స్ 5వ తేదీ నుంచి 11 వరకు ఉంటాయని వెల్లడించింది. 8వ తరగతి విద్యార్థులకు సాయంత్రం, మిగతా విద్యార్థులకు ఉదయం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఎస్ఏ పరీక్షలు ముగిసిన తర్వాత 13 నుంచి 25 వరకు సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. అనంతరం 26 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక సూసైడ్
TS, AP Dasara Holidays 2023: తెలంగాణ, ఏపీలో దసరా సెలవుల ప్రకటన.. లిస్ట్ ఇదే!
తెలంగాణ, ఏపీ విద్యాశాఖ అధికారులు దసరా సెలవులపై కీలక ప్రకటన చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ మొత్తం 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. దసరా సెలవులు అక్టోబర్ 13న ప్రారంభమై.. 25 వరకు కొనసాగనున్నాయి.

Translate this News:











