కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నియోజకవర్గల పునర్విభజనలో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జనాభా ప్రాతిపదికన చేపట్టనున్న ఈ విభజనలో రెండు రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు (Lok Sabha Seats) తగ్గనున్నాయి. ఇలా జరిగితే కేంద్రంలో ఇరు రాష్ట్రాలకు పట్టు తగ్గే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో (Telangana) 17, ఏపీలో (Andhra Pradesh) 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపితే తెలుగు రాష్ట్రాల లోక్ సభ సీట్ల సంఖ్య 37కు తగ్గనుంది. అదే.. 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకర్గాల పునర్విభజన జరిపితే.. ఇరు రాష్ట్రాలకు కలిపి కేవలం 34 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కనున్నాయి. దీంతో ఎలా జరిగినా కూడా తెలుగు రాష్ట్రాలు 5-8 ఎంపీ సీట్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
పూర్తిగా చదవండి..TS, AP Lok Sabha Seats: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ షాక్.. భారీగా తగ్గనున్న ఎంపీ సీట్లు.. ఎన్నంటే?
2026లో జరిగే లోక్ సభ నియోజవర్గాల పునర్విభజనలో తెలంగాణ, ఏపీలో భారీగా సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరు రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 42 ఉండగా.. 5 నుంచి 8 సీట్లు తగ్గనున్నాయి.

Translate this News:











