ఇండియన్ షూటర్ల మీద బోలెడు అంచనాలున్నాయి మొదటి నుంచి. అవి ఏమాత్రం వమ్ము చేయకుండా తమ ప్రతిభను నిలబెట్టుకుంటున్నారు భారత షూటర్లు. నిన్న కొల్లగొట్టిన పతకాలు కాక ఈరోజు 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో స్వప్నిల్ తో కూడిన టీమ్ ఇండియా మెన్ గోల్డ్ ను దక్కించుకున్నారు. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ ఈవెంట్లో రజతాన్ని తమ ఖాతాలోకి వేసుకున్నారు. అలాగే వుమెన్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో భారత మహిళా షూటర్ పాలక్ గోల్డ్ గెలుచుకోగా, ఈషా సింగ్ సిల్వర్‌ను సొంతం చేసుకుంది. నిన్న కూడా టీమ్ ఇండియా షూటర్లు స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. ఇక వుషూలో రజతం, ఈక్వెస్ట్రియన్ లో కాంస్యం కూడా సొంతం చేసుకున్నారు భారత క్రీడాకారులు.
పూర్తిగా చదవండి..asian games: గన్నులు పేలుతున్నాయి…స్వర్ణాలు వస్తున్నాయ్
ఆసియా గేమ్స్ లో షూటర్లు విజృంభిస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ భారత్ ఖాతాలో స్వర్ణాల లెక్క పెంచుతున్నారు. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా పురుషులకు స్వర్ణం వస్తే...10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో అమ్మాయిల జట్టు రజతాన్ని సంపాదించుకున్నారు. మరోవైపు టెన్నిస్ ఈవెంట్లో పరుషుల డబుల్ విభాగంలో భారత జోడి సాకేత్- రామ్ కుమార్ జోడీ ఫైనల్లో చైనా ఆటగాళ్ళతో తలపడి ఓడిపోయారు. దీంతో భారత్ టెన్నిస్ జోడీకి సిల్వర్ మెడల్ వచ్చింది.

Translate this News:













