Chandrababu Arrest Row: కేంద్రంలోని బీజేపీ(BJP) పెద్దల గ్రీన్ సిగ్నల్‌తోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందానన్న అనుమానం తెలుగు ప్రజల్లో నెలకొంది. బీజేపీ డైరెక్షన్‌తోనే ప్రస్తుతం పరిణామాలు జరుగుతున్నాయన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు(Chandrababu) ఎపిసోడ్లో ఇప్పటివరకు బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పలేదు? సొంత మరిది అరెస్ట్ అయినా కనీసం ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి (Purandeswari) ఎందుకు స్పందించలేదు? ప్రస్తుతం అందరి నోటా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ని ఇప్పటికే INDIA కూటమిలోని భాగస్వామ్య పార్టీలు అరెస్ట్‌ను ఖండించాయి. అటు ఎన్డీఏ(NDA) నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదు.
కేంద్రం ఆడిస్తోన్న డ్రామానా?
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ వ్యూహం ఉందన్న ప్రచారం ఏపీలో విస్తృతంగా జరుగుతోంది. అటు కేంద్రం రియాక్ట్ అవ్వకపోగా.. ఇటు ఏపీ బీజేపీ కూడా మౌనం వహిస్తోంది. పురందేశ్వరి కనీసం మాట్లాడడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. పురంధేశ్వరి నోటిని బీజేపీ పెద్దలు కట్టేశారంటూ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు విషయంలో సైలెంట్‌గా ఉంటున్నారు బీజేపీ నేతలు. ఇక కేంద్రం డైరెక్షన్లోనే అంతా జరుగుతోందంటున్న టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అనుమానాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యక్తం చేశారు.
Chandrababu vs BJP: చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దలు? ఇప్పటివరకు నోరు విప్పని కమలనాథులు!
చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రంలోని పెద్దలు జగన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వడం.. ఏపీ రాష్ట్ర బీజేపీ కూడా మౌనం వహిస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత మరిది అరెస్ట్ అయినా కనీసం ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎందుకు స్పందించలేదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

Translate this News:











