ఏపీలోని పాఠశాలల్లో నాడునేడు పథకం కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లోపాలు, నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని వంగలపూడి అనిత అన్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యుత్ స్తంభం కూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా పాయకరావుపేట దుర్గా కాలనీలో సిమెంట్ పలక పడడంతో తులసి సిద్దు ప్రసన్న అనే బాలుడు మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి పర్యటించారు. ఇటీవల పాయకరావుపేట దుర్గానగర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ స్లాబ్ కూలి మృతి చెందిన విద్యార్థి సిద్దు ప్రసన్న తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులను ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పరామర్శించలేదని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..AP Politics: ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది..చిన్నారి మృతికి బాధ్యత వహించాలి: వంగలపూడి అనిత
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇటీవల పాయకరావుపేట దుర్గానగర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ స్లాబ్ కూలి మృతి చెందిన విద్యార్థి సిద్దు ప్రసన్న తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Translate this News:











