చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి (Chandrababu Health Condition) ఆందోళన కరంగా ఉందని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ రోజు నిర్వహించిన అత్యవసర సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) మాట్లాడుతూ.. ఒక్క నెలలో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. అలా ఒక్కసారిగా బరువు తగ్గితే దాని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత వైద్యులను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu Health: చంద్రబాబుకు స్టెరాయిడ్స్.. డాక్టర్లను బెదిరించి తప్పుడు రిపోర్టులు.. టీడీపీ నేతల సంచలన ఆరోపణలు
ప్రభుత్వం నియమించిన వైద్యులను బెదిరించి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నారని టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వారి మెడ మీద కత్తి పెట్టి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చేలా చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ను ఎయిమ్స్ లో లేదా ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు.

Translate this News:











