Andhra Pradesh: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి(Bandaru Satyanarayana)కి బెయిల్ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. ఇదే సమయంలో వైసీపీ(YCP) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణమూర్తిపై ప్రభుత్వం పోలీసులతో హైడ్రామా నడిపిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. కోర్టు మొట్టికాయలు పడతాయని తెలిసినా కేసులు పెట్టి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి దీక్షలు చేపట్టిందని, దీక్షలకు మద్దతు లభిస్తుందని బండారుపై కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. నోటీసులు ఇచ్చి విచారించాల్సిన కేసులో అరెస్టు చేసి తెచ్చారని మండిపడ్డారు. టిడిపి వారిపై కేసులు పోలీసులు సొంత వ్యవహారంలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారాయన. ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏమిటి ఆలోచించండి అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు. పోలీసులతో కేసులు పెట్టే తప్పుడు సంస్కృతి ఏంటని ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి టీడీపీ మహిళా నేతలపై నిత్యం బురద జల్లుతోందని, వారిపై మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేని ఆగ్రహం వ్యక్తం చేశారు నక్కా ఆనందబాబు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: జైలు నుంచి బండారు విడుదల.. టీడీపీ నేతల రియాక్షన్ మామూలుగా లేదుగా..
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి(Bandaru Satyanarayana)కి బెయిల్ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. ఇదే సమయంలో వైసీపీ(YCP) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణమూర్తిపై ప్రభుత్వం పోలీసులతో హైడ్రామా నడిపిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.

Translate this News:











