Chandrababu: రాష్ట్రంలో జగన్ ఆడుతున్న వికృత క్రీడకు ఫుల్ స్టాఫ్ పడాలని మాజీమంత్రులు కిమిడి కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులు ఇచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం లభించడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. చంద్రబాబుతో లాయర్లు రోజువారీ అయ్యే ములాఖత్ లను కూడా తగ్గించారని మండిపడ్డారు. దళితులను చంపిన వారికి, శిరోముండనాలు చేసిన వారికి ఇష్టానుసారంగా ములాఖత్ లకు అవకాశం ఇస్తున్నారని దుయ్యబట్టారు టీడీపీ నేతలు.
పూర్తిగా చదవండి..దళితులను చంపిన వారికి మాత్రమే ములాఖత్ లా..!?
రాజమహేంద్రవరంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను కుటుంబ సభ్యులకు ఎందుకివ్వరు అంటూ ప్రశ్నించారు. లాయర్ల ములాఖత్ ను ఎందుకు తగ్గించారు.? దళితులను చంపిన వారికి మాత్రం ఇష్టానుసారంగా ములాఖత్ లా.? అంటూ మండిపడ్డారు. భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపే హక్కు కూడా మాకు లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర. ఈ క్రమంలోనే జగన్ రాక్షస క్రీడకు త్వరలో ముగింపు చెప్పాలని కోరారు.

Translate this News:











