విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై వంగలపూడి అనిత పలు విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ మాదిరిగానే మంత్రులు కూడా సైకోలా మాట్లాడుతున్నారని సంచలన కామెట్స్ చేశారు. 36 రోజులుగా చంద్రబాబుని పెట్టి జైల్లో హింసిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ బులిటీన్లో షుగర్ లెవల్స్ రిపోర్ట్ లేకపోవడం దారుణమన్నారు. సజ్జల ఊరకుక్కలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని తీవ్ర వాఖ్యలు చేశారు. డీప్యూటీ సీఎం నారాయణస్వామి అమ్మ లాంటి భువనేశ్వరిపై పిచ్చి కూతలు కూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..AP Elections: నారాయణస్వామిపై తెలుగు మహిళల ఆగ్రహం… క్షమాపణలు చెప్పాలని డిమాండ్
భువనేశ్వరిపై మంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణస్వామి చిత్రపటాన్ని టీడీపీ నేత వంగలపూడి అనితతోపాటు తెలుగు మహిళలు చెప్పులతో కొట్టారు. భువనేశ్వరికి నారాయణస్వామి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సీఎం జగన్ మాదిరిగానే మంత్రులు కూడా సైకోలా మాట్లాడుతున్నారని అనిత విమర్శించారు.

Translate this News:











