తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేశ్ రాజమండ్రి నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. లోకేశ్‌తో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడు కూడా ఉన్నారు. రేపు(సెప్టెంబర్ 14) కొందరు ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఆయన ఎవరిని కలుస్తారన్నదానిపై క్లారిటీ లేదు. వందల కోట్ల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.300 కోట్లు రాష్ట్ర నిధులకు నష్టం వాటిల్లింది. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో టీడీపీ అధినేత ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: ఢిల్లీకి చేరుకున్న లోకేశ్.. ఏం చేయబోతున్నారు?
టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. నారా లోకేష్ ఉన్నపళంగా రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. లోకేశ్‌తో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడు కూడా ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ ఢిల్లీ టూర్ చేపట్టినట్లు మరో టాక్ వినిపిస్తోంది.

Translate this News:











