వ్యవస్థలను మేనేజ్ చేసి గత 36 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధిస్తోందని ఫైర్ అయ్యారు. జైలు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణ రెడ్డి (Sajjala Ramakrishna Reddy).. నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ఆవేదనను అవహేళన చేయడం బాధాకరమన్నారు. సజ్జలకు చంద్రబాబు, కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..AP Politics: ఉండవల్లి ఓ ప్యాకేజీ లీడర్.. సజ్జల అక్రమాలు బయటపెడతాం.. బుద్దా వెంకన్న ఫైర్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు.

Translate this News:











