Roja Warning to Bandaru Satyanarayana: టీడీపీ, జనసేనపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు తప్పుచేసి సాక్ష్యాలతో దొరికిపోయాడని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్ కెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కిందన్నారు. మీ నాయకుడు తప్పుచేయలేదని ప్రూవ్ చేసుకోకుండా..!! మా మీద పడి ఏడిస్తే ఏం లాభం రోజా విమర్శలు చేశారు. చంద్రబాబు కోసం పెద్దపెద్ద లాయర్లు ఢిల్లీ నుంచి దిగారు. చంద్రబాబు తప్పు చేయకపోతే.. ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికి నన్ను టార్గెట్ చేశారని మంత్రి రోజా ఆరోపించారు. మాజీ మంత్రిగా చేసిన బండారు చాలా నీచంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఊహతెలిసినంతవరకూ ఎవరూ ఇంతలా ఒక మహిళ గురించి మాట్లాడలేదన్నారు.
పూర్తిగా చదవండి..AP Politics: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి
బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా పోరాడతానని మంత్రి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి వస్తుందన్నారు.

Translate this News:











