సీఐడీ, డీజీపీ ఆదేశిస్తే…వీళ్ళు అరెస్ట్లు చేసేస్తారా..? అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసులను ప్రశ్నించారు. చట్టాలు ఈ పోలీసులకు తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. ఈ రోజు నాపై 5 కేసులు పెట్టారు. కొడతారా..? చంపేస్తారా…? రెడీ చంపేయ్యండి అంటూ సవాల్ చేశారు. మహిళ మంత్రి రోజా ఎన్నో సార్లు దుర్మార్గంగా మాట్లాడ లేదా? మా కుటుంబాల మీద రోజా చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా ఇస్తాం.. కేసు పెట్టు దమ్ము పోలీసులకు ఉందా? అని సవాల్ విసిరారు. మేము కేసులు పెడతాం.. రోజాని అరెస్ట్ చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..AP Politics: రాక్షసుడి పాలనలో న్యాయం ఎక్కడుంది: మాజీ మంత్రి అయ్యన్న
వైసీపీపై టీడీపీ మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. ఏపీలో రాక్షసుడి పాల సాగుతుందని ఆరోపించారు. విశాఖలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయం ఎక్కడ ఉందని ప్రశ్నించాడు. శాడిస్ట్ పరిపాలన ఏ వర్గానికి మర్యాద లేదు.. ఖాకీలకు కూడా గౌరవం లేదని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఎంతో ముఖ్యమంత్రిల దగ్గర నేను పనిచేశా.. ఇలా పాలన నేను ఎక్కడ చూడలేదన్నారు.

Translate this News:











