ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితి గతులపై మంగళవారం పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులను సీఎం జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికీ పరిహారం అందించకపోగా.. లబ్దిదారుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడుతుందని విమర్శించారు. తెలంగాణలో సాగు ఆయకట్టు పెరిగితే, ఏపీలో తగ్గిపోయింది.. నా సంకల్పానికి ఎవరూ అడ్డు రాలేరు.. పోలవరం పూర్తిచేసి, నదుల అనుసంధానంతో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే వరకు ఆగేది లేదని చెప్పారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానన్న హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించిందని, శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు చంద్రబాబు.
పూర్తిగా చదవండి..జగన్మోహన్ రెడ్డి వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగింది: చంద్రబాబు
పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలోని కొత్తగా ఏ ఒక్క కట్టడం కూడా జగన్ రెడ్డి చేపట్టలేదని, ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉందని చెప్పారు. అలాగే 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పురుషోత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ను పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ ఆటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం ఓ ఉదాహరణ..

Translate this News:











