చంద్రబాబు హయాంలోనే ప్రజాగాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గద్దర్ మరణించిన తర్వాత ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా మరోసారి గద్దర్ విషయంలో చంద్రబాబు(chandrababu naidu) వార్తల్లో నిలిచారు. ఇటివలే మరణించిన గద్దర్(gaddar) ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.
గద్దర్ గురించి చంద్రబాబు ఏమన్నారంటే ? :
Chandrababu: ‘నన్ను ఆయన అర్ధం చేసుకున్నారు’.. గద్దర్ ఇంటికి చంద్రబాబు!
పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. గద్దర్ మరణం బాధ కలిగించిందన్నారు. గద్దర్ కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన సమయంలో సీఎంగా చంద్రబాబే ఉన్నారు.

Translate this News:











