Andhra Pradesh: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌ను నిరసిస్తూ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). రేపు రాత్రి అంటే అక్టోబర్ 29వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు(5 నిమిషాలు) ‘కళ్ళు తెరిపిద్దాం’ నిరసన కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారాయన. ఈ మేరకు పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం.. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి, చంద్రబాబుకు మద్దతుగా “నిజం గెలవాలి” అని గట్టిగా నినదిద్దాం.’ అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు నారా లోకేష్. కాగా, టీడీపీ శ్రేణులు, ప్రజలు తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను, చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు లోకేష్.
పూర్తిగా చదవండి..Chandrababu: ‘కళ్లు తెరిపిద్దాం’.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ మరో నిరసన కార్యక్రమం..
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 'జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం.. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి, చంద్రబాబుకు సంఘీభావంగా "నిజం గెలవాలి" అని గట్టిగా నినదిద్దాం.' అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. టీడీపీ శ్రేణులు, ప్రజలు తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను, చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు లోకేష్.

Translate this News:











