Chandrababu arrest Updates: చంద్రబాబు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబుకు(Chandrababu) బెయిల్ ఇవ్వాలంటూ పత్తిపాడుకు చెందిన మహేష్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త ఏసీబీ కోర్టులో(ACB Court) పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున తాను సంతకం పెడుతున్నట్లు తెలిపాడు మహేష్ రెడ్డి చేతి రాతతో కూడిన ఈ పిటిషన్ కాపీని ఏసీబీ కోర్టులో దాఖలు చేశాడు న్యాయవాది చెన్నకేశవులు. దాంతో ఇప్పటి వరకు చంద్రబాబు తరఫున పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు కిలారు నితిన్ కృష్ణ, జి. సుబ్బారావులను పిలిపించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. ఫైనల్గా ఎవరు పిటిషన్ వేస్తారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు జడ్జి. ఇందుకోసం 30 నిమిషాల సమయం ఇచ్చారు న్యాయమూర్తి. దాంతో ఎవరి పిటిషన్ వేయాలో తేల్చుకునే పనిలో పడ్డారు చంద్రబాబు తరఫున లాయర్స్.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..
చంద్రబాబు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ పత్తిపాడుకు చెందిన మహేష్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున తాను సంతకం పెడుతున్నట్లు తెలిపాడు మహేష్ రెడ్డి చేతి రాతతో కూడిన ఈ పిటిషన్ కాపీని ఏసీబీ కోర్టులో దాఖలు చేశాడు న్యాయవాది చెన్నకేశవులు.

Translate this News:











