తెలంగాణ అభ్యర్ధుల లిస్ట్ మీద స్క్రీనింగ్ కమిటీ చేస్తున్న కసరత్తులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. నిన్న, ఈరోజు సుదీర్ఘంగా ఈ విషయం మీద కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. టికెట్ కేటాయింపులలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ కుమార్ మధ్య చాలా వాడీవేడిగా చర్చలు జరిగనట్లు సమాచారం. సామాజిక సమీకరణలు, ఆర్ధి, రాజకీయ అంశాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారని తెలుస్తోంది. దాదాపు 60 శాతం అంగీకారంతో అభ్యర్ధుల లిస్ట్ తయారైందని చెబుతున్నారు. ఈ తొలి జాబితాను స్క్రీనింగ్ కమిటీ అధిష్టానానికి చేరవేయనుంది. ఈ నెలాఖరు లేదా అక్టోబరు మొదటి వారంలో తొలి జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు. మొత్తం 119 స్థానాలకు గానూ 70 కి పైగా స్థానాల్లో ిఫ్పటికే క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..టీకాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా ఫిక్స్!
ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల లిస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సర్వేలు, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్ధులనే ఎంపిక చేసినట్లు సమాచారం.

Translate this News:











