Tata to Make iPhones: ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్కు పునాదులు వేసిన టాటా(TATA) సంస్థ.. మరో ముందడుగు వేసింది. మొబైల్ దిగ్గజంతో జత కట్టింది. యాపిల్ ఐఫోన్ల(Apple iPhone) తయారీలో ఇకపై టాటా భాగం కానుంది. బెంగళూరు సమీపంలోని అసెంబ్లింగ్ ప్లాంట్ విక్రయానికి విస్ట్రాన్ కార్ప్ ఆమోదం కోసం కేంద్రం వెయిట్ చేస్తోంది. ఆమోదం లభించిన వెంటనే టాటా గ్రూప్ త్వరలో దేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది. రెండున్నరేళ్లలో తయారీ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. విస్ట్రోన్ ఇన్ఫోకామ్ మాన్యుఫ్యాక్చరింగ్ (Wistron Infocomm Manufacturing )ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను టాటాకు 125డాలర్ల మిలియన్లకు విక్రయించనుంది. రెండు గ్రూపులు తమ ఒప్పందాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కంపెనీలు రెగ్యులేటరీ అనుమతులను కోరుకుంటాయి.
పూర్తిగా చదవండి..TATA iPhones: దిగ్గజాలు కలిసే.. ఐఫోన్ల తయారీలోకి ‘టాటా’ ఎంట్రీ..!
దేశానికి కార్పొరేట్ కల్చర్‌ను నేర్పిన టాటా సంస్థ మరోసారి ఇండియా గర్వ పడే డీల్‌ను దక్కించుకుంది. మొబైల్ దిగ్గజం 'యాపిల్ ఐఫోన్ల' తయారీ త్వరలో ఇండియాలోనే ప్రారంభంకానుంది. విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత టాటా గ్రూప్ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది. నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐఫోన్లలో 25శాతం ఇండియా నుంచే ఉత్పత్తి అవుతాయి.

Translate this News:











