ఓ వైపు ఎన్నిలక వేడి రాజుకుంటుంటే..మరోవైపు ప్రతిపక్షాలకు ధరణి ఓ పెద్ద అస్త్రంగా మారుతోంది. దీంతో ధరణి పోర్టల్ పై మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలోకి రాగానే ముందుగా ధరణినే రద్దు చేస్తామని కాంగ్రెస్ లు హామీల మీద హామీ ఇస్తుంటే.. రద్దు చేయం కాని అందులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని కమలనాథులంటున్నారు. అధికార పక్షం బీఆర్ఎస్ మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా.. ధరణి ప్రయోజనాలను ప్రచారం చేస్తూ.. అంతా సవ్యంగానే ఉందని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతే కాదు ధరణి రద్దు చేస్తామన్న పార్టీని గద్దెనెక్కిస్తే.. భూముల సంగతి అంతే సంగతులు అని గులాబీ బాస్ జనానికి హితవు పలుకుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వేడిని డబుల్ చేస్తున్న ధరణి పోర్టల్ ఎవరికి అస్త్రంగా మారబోతుంది.. దాని పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల స్టాండ్ ఏంటి..?
పూర్తిగా చదవండి..టార్గెట్ కేసీఆర్ . ధరణిపైనే ప్రతిపక్షాల ఫోకస్
రానున్న ఎన్నికల్లో ఎవరికి ‘ధరణి’ అస్త్రంగా మారనుంది..రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ కు ఓట్లు రాలుతాయా..బీజేపీ స్టాండ్ అంతేనా!! ఎన్నికల్లో వేడిని డబుల్ చేస్తున్న ధరణి పోర్టల్ తో ఏ పార్టీకి ప్రయోజనం చేకూరబోతుంది..అన్నదాతల ఓట్లు ఎవరి ఖాతాలోకి...!!

Translate this News:














