Rs 753 Cr Found in Man Account: గత నెలలో తమిళనాడులోని ఓ క్యాబ్ డ్రైవర్(Driver) ఖాతాలో రూ. 9000 కోట్లు (Money) జమ అయిన విషయం తెలిసిందే. అయితే, అలా పడటమే ఆలస్యం.. అరగంటలో డబ్బు బ్యాంకు ఖాతాలోకి వాపస్ వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. అయితే, ఇప్పుడు కూడా అలాంటి ఘటనే పునారవృతం అయ్యింది. అది కూడా చెన్నైలోనే కావడం విశేషం. చెన్నైలోని ఓ ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగి ఇద్రిస్ ఖాతాలో రూ.753 కోట్లు జమ అయ్యాయి. అంత డబ్బు అకౌంట్లో పడినట్లు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. కాసేపటి తరువాత సాధారణ స్థితికి చేరుకుని.. వెంటనే బ్యాంకుకు కాల్ చేశాడు. జరిగి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి ఖాతాను స్తంభింపజేసింది. ఎలాంటి లావాదేవీలు జరుగకుండా ఫ్రీజ్ చేసింది. వాస్తవానికి ఈ వ్యక్తి తన స్నేహితుడికి రూ. 2000 డిజిటల్ రూపంలో పంపించాడు. అయితే, ఆ డబ్బు పంపించిన కాసేపటికే.. రూ. 753 కోట్లు అతని అకౌంట్లోకి వచ్చాయి. దాంతో అతని బిత్తరపోయాడు.
పూర్తిగా చదవండి..Viral News: రూ. 2000 పంపితే.. రూ. 753 కోట్లు వచ్చాయి.. లైఫ్ సెట్ అనుకున్నాడు.. అంతలోనే..
చెన్నైలోని ఓ ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగి ఇద్రిస్ ఖాతాలో రూ.753 కోట్లు జమ అయ్యాయి. అంత డబ్బు అకౌంట్లో పడినట్లు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. కాసేపటి తరువాత సాధారణ స్థితికి చేరుకుని.. వెంటనే బ్యాంకుకు కాల్ చేశాడు. జరిగి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి ఖాతాను స్తంభింపజేసింది.

Translate this News:











