భారత్‌లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎక్కడుందంటే అందిరికీ తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న విగ్రహం కనిపిస్తోంది. ఈఏడాది అంబేద్కర్ దినోత్సవం సందర్భంగా ఏకంగా 125 అడుగులు ఉన్న ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. అయితే ఇండియా వెలుపల కూడా అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అక్టోబర్ 14న ఆవిష్కరించారు. ఉత్తర అమెరికాలోని మేరీలాండ్ ప్రాంతంలో.. స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో 13 ఎకరాల ప్రాంగణంలో 19 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇది సమానత్వానికి, అలాగే మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని.. ‘అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్’ (ఏఐసీ) తెలిపింది. మరో విషయం ఏంటంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి అయిన రామ్ సుతర్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.
పూర్తిగా చదవండి..Statue of Equality: భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.. ఎక్కడో తెలుసా..
భారత్‌లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం తెలంగాణలోని హైదరాబద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత్ వెలుపల కూడా అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. ఇది సమానత్వానికి, అలాగే మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని.. 'అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్' (ఏఐసీ) తెలిపింది. గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి అయిన రామ్ సుతర్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.

Translate this News:











