కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు.. అన్నివేళల తోడునీడగా ఉంటారు.. కష్టాల్లో సాయం చేస్తారు.. ఆపదలో ఆదుకుంటారు.. కానీ వాళ్లకి దక్కనది మనకి దక్కితే తట్టుకోలేరు.. ముఖం మాడ్చుకుంటారు.. మౌనంగా ఉండిపోతారు.. లోలోపల ఏడుస్తారు.. ఇదో వెరైటీ టైప్ ఆఫ్ మైండ్‌సెట్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని చూసి కొంతమంది ఇలానే గుసగుసలాడుకుంటున్నారు. చంద్రయాన్-3 సక్సెస్ అవ్వడం అయ్యాగారికి ఏం ఇష్టం లేనట్టుంది.. ఎందుకంటే మూడు రోజుల ముందే కదా రష్యా లూనా-25 అస్సాం అయ్యింది. ఇండియా కంటే ముందుగా జాబిల్లిపై కాలు మోపాలని భావించిన పుతిన్‌కి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.. నిజానికి అంతరిక్ష ప్రయోగాలు సక్సెస్ అయినా అవ్వకపోయినా చేసిన ప్రయత్నానికి అభినందించాల్సిందే. ఇదే స్పోరిటివ్నెస్. కానీ రష్యా మాత్రం ఈ విషయంలో కాస్త కుళ్లుబోతుతనం చూపించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అసలు కవరేజే లేదు:
ఇస్రో సాధించిన విజయాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఓవైపు అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్‌ని కీర్తిస్తుంటే.. మరోవైపు రష్యా మాత్రం అసలు కవరేజీ ఇవ్వలేదు. అంతర్జాతీయ వార్తా వెబ్సైట్లలో బ్యానర్ ఐటెమ్‌గా కనిపించిన మన ఇస్రో విజయం.. రష్యా బ్లాగుల్లో చాలా సేపటివరకు అసలు హోం పేజీలోనే కనపడలేదు. RT(Russia Today)లో మాత్రం ల్యాండింగ్ జరిగిన గంట తర్వాత వార్త కనిపించింది. అది కూడా మొక్కుబడిగా పబ్లిష్ చేసినట్టు ఉందని వెస్ట్రర్న్ మీడియా అంటోంది. మరోవైపు దొరికిందే ఛాన్స్ అని రష్యాకి చురకలంటిస్తూ యూకే మీడియా పలు వార్తలను ప్రచురించింది. mirror.co.uk పుతిన్ ఓడిపోయాడంటూ లీడ్ పెట్టింది.
నిజానికి ఇండియా-రష్యా చాలా మంచి స్నేహితులు. ప్రతి విషయంలోనూ కలిసి అడుగులు వేసే దేశాలు. ఇటివలి కాలంలో అమెరికాతోనూ ఇండియా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నా.. రష్యా మాత్రం ట్రెడిషనల్‌గా ఇండియాకి మంచి ఫ్రెండ్. రష్యా-ఇండియా బంధం చాలా గట్టిది. లూనా-24 తుది మెట్టుపై బోల్తా పడడంతో పాటు.. ఇటివలి కాలంలో రష్యా అంతరిక్షంలో వెనకపడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. స్పేస్ పరంగా ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడంతో ఏకంగా ఎంక్వైరీలు కూడా వేయించింది పుతిన్ సర్కార్. ఇటు చంద్రుడి దక్షిణ ధృవంపై ఇండియా కాలు మోపిన తొలి దేశంగా నిలవడం.. ఇస్రో కంటే ముందుగా జాబిల్లిపై అడుగుపెట్టాలని భావించిన రష్యా మిషన్ ఫెయిల్ అవ్వడం పుతిన్‌ని కాస్త అప్సెట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
Chandrayaan-3
Chandrayaan-3: దటీజ్ ఇస్రో… చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్
Chandrayaan-3 lands on moon surface: దేశమంతా సంబురాలు మొదలయ్యాయి.. ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది.. పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లల మారి కేరింతలు కొడుతున్నారు.. చంద్రయాన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది.. ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపింది.. రోవర్ వడివడిగా అడుగులేసుకుంటూ చంద్రుడి నేలను తాకింది.. కోట్ల మంది కళ్లలో వెలుగులు.. కాలర్ ఎగరేసుకునే గర్వం.. ఇదేరా ఇండియా అని చెప్పుకునే ఆనందం.. మొత్తానికి దటీజ్ ఇస్రో అని ప్రపంచమంతా అనుకునేలా చేశారు సైంటిస్టులు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలమిది.
చంద్రయాన్-2 ఓటమితో కుంగిపోలేదు.. బాధపడ్డారు.. ఆ బాధలో నుంచే కసి పుట్టింది. చంద్రయాన్-3కి ఇస్రో సైంటిస్టులు శ్రీకారం చుట్టారు.. ప్రాణంపెట్టి పనిచేశారు.. ఓటమి రుచి చవి చూడని వారికి గెలుపు రుచి తెలియదంటారు కదా.. ఇస్రో శాస్త్రవేత్తల ఆనందం చూస్తే ఇప్పుడా విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. అంతా చిన్నపిల్లల మారిపోయారు.. ఈ రోజు కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటున్న వారి కంటి నుంచి కన్నీళ్లు తన్నుకొచ్చాయి..ఇవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు.. చంద్రయాన్-2 సమయంలో చివరిమెట్టుపై బోల్తా పడినప్పుడు వచ్చిన కన్నీళ్లు కావు ఇవి.. ఇది ఇస్రో సైంటిస్టుల గెలుపు.. వారి కష్టానికి దక్కిన గౌరవం. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశం మనదేనని 140 కోట్ల ప్రజలు సగర్వంగా చెప్పుకుంటారంటే అది కేవలం ఇస్రో సాధించిన విజయం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి మానవ నిర్మిత ప్రోబ్ కూడా మనదే!
దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కూడా ఇస్రోదే. దేశ ప్రధాని నుంచి సాధారణ పౌరుల వరకు.. విద్యార్థులు, ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించారు. టీవీలకు అతుక్కుపోయారు. దేశం అంతా ఏకమయ్యే క్రికెట్ మ్యాచ్‌ని మించి ఓ అంతరిక్ష ప్రయోగం గురించి ప్రతిఒక్కరూ తమ షెడ్యూల్‌లను మార్చుకున్నారంటే ఇస్రో గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతోంది. కుల, మత బేధాలు మరిచి అందరూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రోడ్లపైకి స్వీట్లు పంచుకుంటున్నారు. ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలా దేశమంతా ఏకం కావడం.. ఆనందంలో మునిగిపోవడం చూసి ఏళ్లు దాటిపోయాయి.. ఇదంతా ఇస్రో వల్లే సాధ్యమైంది.. దటీజ్ ఇస్రో..జయహో ఇండియా!
ISRO: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్స్.. అప్లై చేసుకోండి!
ISRO Free Course: ప్రపంచవ్యాప్తంగా ఇస్రో పేరు మారుమోగుతోంది. అంతరిక్ష ప్రయోగాలకు పెట్టింది పేరైన రష్యాకే సాధ్యంకాని ఘనతలను సాధిస్తోంది భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో. చంద్రయాన్-3(chandrayaan-3) ప్రయోగం సక్సెస్ అయ్యేందుకు టైమ్ దగ్గరపడింది. మరోవైపు అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆలోచన అందరికి ఉంటుంది. స్పేస్ విషయాలను నెట్లో సెర్చ్ చేసే శోధించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అసలు రాకెట్లు, శాటిలైట్లు లాంటివి కనపిస్తే చాలు ప్రజలు ఆ విషయం గురించి తెలిసినా తెలియకపోయినా వాటి లింకులపై క్లిక్ చేస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులకు అంతరిక్ష విషయాలపై నాలెడ్జ్ పెంచుకోవాలన్న తపన ఉంటుంది. అలాంటి వారికి ఇస్రో గుడ్‌న్యూస్ చెప్పింది.
• అక్టోబర్‌లో కోర్సు:
అంతరిక్ష పరిస్థితులపై అవగాహన కోసం మూడు రోజుల పాటు విద్యార్థుల నుంచి ఇస్రో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 12, 13, 14 తేదీలలో బెంగుళూరులోని ISRO ప్రధాన కార్యాలయంలో ఈ కోర్సు నిర్వహించనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలతో సెషన్లను ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సుకి అప్లై చేసుకోవచ్చు. ఇక సైన్స్ ఫిల్డ్లోనే పనిచేస్తున్న పరిశోధకులు, అధ్యాపకుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తోంది ఇస్రో.
అంతరిక్ష రంగంలో పనిచేయాలని ఆశించే విద్యార్థులు, కంపెనీ, ఏజెన్సీ లేదా స్టార్టప్లకి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. స్పేస్ సిట్యువేషనల్ అవేర్నెస్ అండ్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కీలకమైన అంశంగా ఈ కోర్సును అందిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. మానవ నైపుణ్యం, కక్ష్య(orbit) సమాచారం కోసం రాడార్లు, టెలిస్కోప్‌లు, అంతరిక్ష-ఆధారిత ప్లాట్‌ఫామ్స్ గురించి విద్యార్థులకు సైంటిస్టులు చెబుతారు.
• ఇస్రో ఉచిత కోర్సు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
కాలేజీలు, యూనివర్శిటీలు లేదా ఇన్స్టిట్యూట్ల నుంచి కింది కోర్సులను అభ్యసిస్తున్న ఇండియన్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
‣ 4వ సంవత్సరం చదువుతున్న బీఈ లేదా బీటెక్ విద్యార్థులు.
‣ అన్ని శాఖలకు చెందిన ఎంఈ(ME), ఎంటెక్(MTech), ఎమ్మెస్సీ(MSc) విద్యార్థులు.
‣ పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ పీహెచ్డీ విద్యార్థులు లేదా రీసెర్చ్ స్కాలర్లు
‣ భారతీయ విద్యాసంస్థల ఫ్యాకల్టీ సభ్యులు.
మూడు రోజుల కోర్సులో మొత్తం 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కోసం పాల్గొనేవారిని ఎంపిక చేయడానికి ఆన్లైన్ క్విజ్ నిర్వహించవచ్చు. క్విజ్‌తో పాటు, ఎంపిక ప్రక్రియ కోసం విద్య అర్హతను కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
• ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఆగష్టు 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల ఫలితాలు సెప్టెంబర్ 12న ప్రకటిస్తారు. ఆన్లైన్ క్విజ్ సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తారు. లాగిన్ క్రెడెన్షియల్ ఇస్తారు. క్విజ్‌లో అంతరిక్ష పరిస్థితుల అవగాహనపై 20 ప్రశ్నలు ఉంటాయి, వాటిని పది నిమిషాల్లో సమర్పించాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయండి.
Chandrayaan-3:ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ తిలకించాలి: పురంధేశ్వరి!
Purandeswari On Chandrayaan-3: యావత్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకం చేపట్టిన చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ కు అంతా సిద్ధమైంది. బుధవారం సాయంత్రం ఓ అద్భుతం జరగబోతుందని శాస్త్రవేత్తలు, ప్రజలు, రాజకీయ నాయకులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కీలక ఘట్టం పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా స్పందించారు. చరిత్రలో జరగబోతున్న ఓ మహత్ కార్యాన్ని చూసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలన్నారు. ఆమె చంద్రయాన్ 3 గురించి మాట్లాడుతూ..చంద్రయాన్ 3 చంద్ర భూభాగాన్ని తాకేందుకు సిద్దమవుతున్న కొద్దీ ఉత్సాహాం పెరిగిపోతుందని ఆమె అన్నారు.
చంద్రయాన్ 3 విజయం కోసం కొన్ని కోట్ల హృదయాలు వేచి చూస్తున్నాయని ఆమె అన్నారు. ఈరోజు సాయంత్రం 6:04 నిమిషాలకు చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. దానిని తిలకించేందుకు ప్రజలు అందరూ కూడా సిద్దంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇస్రో గొప్పతనాన్ని, వారి పడిన శ్రమను, వారు చేసిన కృషిని ప్రజలు గుర్తించాలని ఆమె అన్నారు. గత నెల 14 న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 మరి కొన్ని గంటల్లో చంద్రుని మీద ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. దాదాపు 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మూన్ మిషన్ విజయవంతమైతే అమెరికా, సోవియెట్ యూనియన్ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా చరిత్ర సృష్టించనుంది.
Also Read: 🔴 Chandrayaan 3 Live Updates: చంద్రయాన్-3 లైవ్ అప్డేట్స్
Chandrayaan-3: మరి కొద్ది గంటల్లో చారిత్రాత్మక ఘట్టం .!తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
Chandrayaan-3 Landing in few more hours: 30 కిలో మీటర్ల ఎత్తునుంచి చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండర్ మాడ్యుల్ పరిస్థితులను పరిశీలించి అన్ని పరిస్థితులు అనుకూలంగా వుంటే ఈ రోజ విక్రమ్ ల్యాండ్ అవుతుందన్నారు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో ల్యాండింగ్ ను ఈ నెల 27కు వాయిదా వేసే అవకాశం ఉందని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు
చంద్రయాన్ విజయవంతం కావాలని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక మైన పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆ అద్బుతమైన క్షణాలను ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఇప్పటికే భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ లాంటి ప్రముఖు ఇప్పటికే వెల్లడించారు. చంద్రయాన్-3 లైవ్ టెలికాస్ట్ ను తమ దేశంలో కూడా చేయాలని పాక్ మాజీ మంత్రులు కూడా అంటున్నారు.
తిరుపతిలో..
చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాడార్ చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేయాలని శ్రీవారి పాదాల చెంత విద్యార్థులు పూజలు చేశారు.
భారత్ గర్వించదగ్గ ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవాళ సాయంత్రం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని, ఇస్త్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెప్పారు.
ఏలూరు జిల్లాలో ..
జంగారెడ్డిగూడెం లో విద్యా వికాస్ ఆవరణలో చంద్రయాన్ విజయవంతం కావాలంటూ వినూత్న కార్యక్రమం.
చంద్రయాన్ 3 ఆకారంలో విద్యార్థులు ఏర్పడి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఉంగుటూరు లో
భీమడోలులో చంద్రయాన్-3 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ భీమడోలు మానసా పాఠశాల విద్యార్థులు 30అడుగుల రాకెట్ నమూనాతో ర్యాలీఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 నేడు చంద్రుని దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ అవనుందని, మన దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా చాటనుందని భీమడోలు మనసా పాఠశాల కరస్పాండెంట్ యలమర్తి రవికుమార్ ఆకాంక్షించారు.
బుధవారం భీమడోలు గాంధీబొమ్మ సెంటర్ కూడలిలో మానసా పాఠశాల విద్యార్థులు, పాఠశాల సిబ్బంది చంద్రయాన్-3 పై విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ 30అడుగుల చంద్రయాన్ రాకెట్ నమూనా ఏర్పాటుచేసి రాకెట్ ప్రయోగ దశలను, ప్రయోగ అవశ్యకతను పాఠశాల విద్యార్థులకు, గ్రామస్తులకు కరస్పాండెంట్ రవికుమార్ వివరించారు. నేడు చంద్రయాన్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన తొలి మిషన్ కానుందని దాదాపు 40 రోజుల చంద్రయాన్-3 ప్రయాణం దాదాపు పూర్తయిందని ఇస్రో కీర్తి మరింత పెరగనుందని అన్నీ అనుకున్నట్టు సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ తో చంద్రయాన్ 3 విజయవంతం అవుతుందని, ఈ ప్రయోగం దేశానికి గర్వకారణం, భావి పౌరులకు స్ఫూర్తిదాయకం అని రవికుమార్ ఆకాంక్షించారు.. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు
విజయవాడలో…
చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకొంటున్న యావత్ భారతావని..
చంద్రయాన్ 3 వీక్షణ కోసం అన్ని స్కూల్స్ లో ప్రత్యేక ఎర్పాట్లు..
అన్ని ప్రభుత్వ, ప్రవేట్ సంస్థల్లో చంద్రయాన్ 3 లైవ్ ప్రోగ్రాం..
చివరి 17 నిమిషాలు ఉత్కంఠ భరితంగా ఉంటుందని చెప్పిన ఇస్రో..
ప్రభుత్వం పాఠశాలలో సాయంత్రం 7 గంటల వరకు వుండనున్న విద్యార్థులు
డిజిటల్ క్లాస్ రూమ్ లలో ప్రత్యక్ష ప్రసారాలకు యర్పాట్లు..
చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ర్యాలీ లు చేస్తున్న స్కూల్ విద్యార్థులు
వరంగల్ జిల్లాలో…
చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం అవ్వాలని శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ భారత శాస్త్రవేత్తలు మరోసారి సత్తా ఏమిటో తెలిపారు. గత నెల రోజుల క్రితం అంతరిక్ష పరిశోధన నిమిత్తం చంద్ర పరిశోధనలు చేయడానికి చంద్రయన్ లోకి పంపించిన చంద్రయన్ ఈ రోజున సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల కు చేరుకుంది అని చెప్పారు ఈ ఘనత భారత శాస్త్రవేత్తల ది అని కొనియాడారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో
ఏలేశ్వరం నరేన్ మోడల్ స్కూల్ పిల్లలు, టీచర్స్ చంద్రయాన్ 3 సందర్భంగా ఇస్రో శాస్త్రజ్ఞులకు
ఆల్ ది బెస్ట్ ఇస్రో అని నినాదాలు..
విక్రం లాండర్ మరియు ప్రగ్యాన్ రోవర్లకు సాంకేతికంగా అన్ని సక్రమంగా జరగాలని శుభాకాంక్షలు తెలిపిన స్కూల్ పిల్లలపిల్లల..
ఇస్రో కి ఆల్ ది బెస్ట్ అంటూ నినాదాలు..
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా సాయం
ల్యాండర్ మాడ్యూల్ తో కమ్యూనికేట్ చేయడంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ), నాసాలు సహయాన్ని అందించనున్నాయి. చంద్రయాన్-3పై ఇందిరాగాంధీ ప్లానిటోరియంలో వర్క్ షాపు నిర్వహిస్తున్నారు. బ్రిక్స్ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి నుంచి వర్చువల్ గా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించనున్నారు.











