బాలీవుడ్ నటి గాయత్రి జోషి (Gayatri Joshi), ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi) ఘోర ప్రమాదం నుంచి తప్పుంచుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ఇటలీలో ఘోర ప్రమాదానికి గురైంది. సార్డీనియాలో జరిగిన లగ్జరీ కార్ల ప్రదర్శన పోటీ సందర్భంగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయత్రి జోషి, ఆమె భర్త ప్రాణాలతో బయటపడ్డారు. అయితే.. ఈ ప్రమాదం కారణంగా స్విట్జర్లాండ్ కు చెందిన ఓ జంట దుర్మరణం పొందారు. ఈ ప్రమాదంలో గాయత్రీ జోషి మరియు ఆమె భర్త వికాస్ ప్రయాణిస్తున్న ఫెర్రారీ కారు, లంబోర్గిని కార్లు ముందున్న క్యాంపర్ వ్యాన్ ను క్రాస్ చేయబోతుండగా ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి.
ఇది కూడా చదవండి: Viral Video: ఇలా చేస్తే ప్రాణాలు పోతాయ్.. షాకింగ్ వీడియోలు షేర్ చేసిన సజ్జనార్ ఐపీఎస్
Gayatri Joshi Accident: బాలీవుడ్ నటి గాయత్రీ జోషి దంపతులకు తప్పిన పెను ప్రమాదం.. వైరల్ వీడియో!
బాలీవుడ్ నటి గాయత్రీ జోషి (Gayatri Joshi), ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi) ప్రయాణిస్తున్న కారుకు ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. సార్డీనియాలో జరిగిన లగ్జరీ కార్ల ప్రదర్శన పోటీ సందర్భంగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో వారు క్షేమంగా బయటపడ్డారు.

Translate this News:











