మహిళ గర్భవిచ్ఛిత్తి కేసుకు సంబంధించిన విషయంలో పిండం పరిస్థితిపై నివేదిక సమర్పించాలని శుక్రవారం సుప్రీంకోర్టు.. ఎయిమ్స్ వైద్య మండలిని కోరింది. గతంలో వారు ఇచ్చినటువంటి నివేదికలో పిండం పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరంగా మరోసారి నివేదిక ఇవ్వండని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తెలిపింది. ప్రసవానంతర కుంగుబాటును ఎదుర్కొనేందుకు మహిళ.. ఔషధాలను వాడుతున్నారని.. ఆ అంశాన్నీ పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం ఎయిమ్స్ వైద్యులను కోరింది. ఈ ఔషధాల వినియోగించడం వల్ల ఆమె గర్భంపై పడే ప్రభావాన్ని అంచనా వేయాలని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల మహిళ అబార్షన్ చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పూర్తిగా చదవండి..Supreme Court: మహిళ గర్భవిచ్ఛిత్తి కేసు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..
మహిళ గర్భవిచ్ఛిత్తి కేసుకు సంబంధించిన విషయంలో పిండం పరిస్థితిపై నివేదిక సమర్పించాలని శుక్రవారం సుప్రీంకోర్టు.. ఎయిమ్స్ వైద్య మండలిని కోరింది. గతంలో వారు ఇచ్చినటువంటి నివేదికలో పిండం పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరంగా మరోసారి నివేదిక ఇవ్వండని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తెలిపింది.

Translate this News:











