స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలనే అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2తో తీర్పు వెల్లడించింది. ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం చూసుకుంటే.. స్వలింగ సంపర్క జంటలు చేసుకునే వివాహానికి ఎటువంటి గుర్తింపు లేదని.. ఇలాంటి వివాహాలకు మేం హక్కులను కల్పించలేమని తెలిపింది. అది తమ ప్రాథమిక హక్కు అని స్వలింగ సంపర్కులు పేర్కొనకూడదని.. అయితే ఈ వివాహాలను గుర్తించేలా చట్టాలను చేసే బాధ్యత పార్లమెంట్‌కే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాలకు సుప్రీంకోర్టు నిరాకరణ
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2తో తీర్పు వెల్లడించింది.

Translate this News:











