Manish Sisodia cant be in Jail – Supreme Court: మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కొన్నాళ్లుగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. మనీశ్ సిసోడియాను నిరవధికంగా జైలులో ఉంచలేమంటూ పేర్కొంది. ఆయనపై మోపినటువంటి అభియోగాలను ట్రయల్ కోర్టులో ఎప్పుడు వాదనలు వినిపించడం ప్రారంభిస్తారని.. సీబీఐ (CBI), ఈడీ (ED)ల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ ఎస్.వి రాజును ధర్మాసనం ప్రశ్నించింది. సిసోడియాను ఇలా నిరవధికంగా జైల్లో ఉంచలేరని.. కేసులో ఒకసారి అభియోగంపత్రం దాఖలైతే దానిపై వెంటనే వాదనలు మొదలవ్వాల్సిందేనని వ్యాఖ్యానించింది.
ఇప్పటివరకు అది ఎందుకు చేయలేదో మంగళవారం చెప్పాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. సిసోడియా బెయిల్ పిటిషన్లపై విచారణ చేసిన సందర్భంగా సుప్రీం ఈ విధంగా స్పందించింది. అయితే సిసోడియాపై ఉన్న కేసులు ప్రస్తుతం సీఆర్పీసీలో సెక్షన్ 207 దశ వద్ద ఉన్నాయని.. దాని తర్వాత వాదనలు ప్రారంభమవుతాయని ఎస్.వి రాజు తెలిపారు.

Also Read: మొయిత్రా లోక్‌సభ అకౌంట్‌ను చెక్ చేయాలి.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
పూర్తిగా చదవండి..