Amaravati R5 Zone: అమరావతి ఆర్-5 జోన్ అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆర్-5 జోన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna)తో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ నెలకు వాయిదా వేసింది. దీంతో అక్కడ ఇళ్లు కట్టి పేదలకు ఇవ్వాలన్న ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాజధాని అమరావతి పరిధిలోని ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని గతంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
పూర్తిగా చదవండి..Supreme Court: అమరావతి ఆర్5 జోన్‌పై సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్
అమరావతి ఆర్5 జోన్ అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆర్- 5 జోన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ నెలకు వాయిదా వేసింది.

Translate this News:











