ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసు (Skill Development Case) విషయమై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై (Quash Petition) సుప్రీంకోర్టులో రెండో రోజు వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. 17 ఏ సెక్షన్ చుట్టే వాదనలు సాగాయి. ఈ కేసుకు సంబంధించి 17 ఏ వర్తించదని సీఐడీ లాయర్లు వాదనలు వినిపిస్తే.. చంద్రబాబు లాయర్లు మాత్రం వర్తిస్తుందని వాదించారు. అయితే.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం 2 గంటలకు క్వాష్ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది సుప్రీంకోర్టు. సెక్షన్ 17-ఏ పంచాయితీ ఎటూ తేలకపోవడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను మరో సారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే.. ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినపించారు. అయితే తదుపరి విచారణకు తాను వర్చువల్ గా హాజరు అవుతానని హరీశ్ సాల్వే వెల్లడించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Nara Lokesh: నారా లోకేష్ సీఐడీ విచారణకు లంచ్ బ్రేక్.. మూడు గంటల పాటు అడిగిన ప్రశ్నలివే!
Big Breaking: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 17-ఏ పంచాయితీ ఎటూ తేలకపోవడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను మరో సారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసును విచారించనుంది సుప్రీంకోర్టు.

Translate this News:











