గర్భవిచ్చిత్తికి సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు అబార్షన్ కు అనుమతినివ్వాలంటూ రీసెంట్ గా ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని…మూడోవారిని పెంచే ఆర్ధిక స్థోమత లేదని ఆమె చెప్పింది. వీటిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అబార్షన్ కు అనుమినిచ్చింది. అక్టోబర్ 9న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. దాంతోపాటూ ఈ ప్రక్రియను చేపట్టాల్సిందిగా ఎయిమ్స్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే దాని తరువాత గర్భవిచ్చిత్తి చేసినా కూడా శిశువు బతికే అవకాశాలున్నాయని…అందుకే కోర్టు అబార్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఎయిమ్స్ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసు మీద మరోసారి విచారణను చేపట్టింది.
పూర్తిగా చదవండి..Supreme Court: :జీవం ఉన్న పిండం గుండె చప్పుడు ఆపాలని ఏ కోర్టు చెబుతుంది…సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కడుపులో ఉన్న పిండాన్ని చంపమని ఏ కోర్టు చెబుతుంది అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 26 వారాల గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఉన్నాయంటూ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక మీద సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది.

Translate this News:











