వరంగల్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారత్ స్వాతంత్ర్య దేశంగా అవతరించగలిగిందన్నారు. ఆంగ్లేయులను ఎదురించి, అహింసా నినాదంతో చేసిన పోరాట ఫలితంగానే దేశానికి ఆంగ్లేయుల నుంచి విముక్తి కలిగిందన్నారు.
పూర్తిగా చదవండి..Errabelli Dayakar Rao: స్వాతంత్ర్య పోరాటంలాగే తెలంగాణ పోరాటం సాగింది
వరంగల్లో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగియి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పరేడ్లో పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య భారతదేశమన్నారు. స్వాతంత్ర్య పోరాటం మాధిరిగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటం సాగిందన్న మంత్రి.. రాష్ట్రం ఏర్పడ్డ అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.

Translate this News:











