Stock Market Today: బలహీనమైన ప్రపంచ మార్కెట్ల సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, ట్రెజరీ రాబడులు పెరగడంతో యూఎస్ స్టాక్ సూచీలు కూడా నిన్న బాగా నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చనే భయాలను పునరుద్ధరించాయి. నిన్న నమోదైన నష్టాలు ఈరోజు కూడా కొనసాగాయి. సెన్సెక్స్ (Sensex) మళ్ళీ 500 పాయింట్ల నష్టానికి చేరువైంది. నిఫ్టీ (Nifty) అయితే 19000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63,557 దగ్గర…నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 18,966 దగ్గర ట్రేడవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Stock Market Today: రెండు రోజులుగా నష్టాలో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు
గత నాలుగు రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా మార్కెట్ సూచీలు నష్టాలతోనే ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63,557 దగ్గర...నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 18,966 దగ్గర కొనసాగుతోంది.

Translate this News:











