Stock Market Today: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల ప్రభావాలతో దేశీయ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా మొదలయ్యాయి. సెన్సెక్స్ (Sensex)30 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 19 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి. నిన్న రోజు ముగిసేసరికి మరీ ఎక్కువగా కాకపోయినా లాభాలతో దేశీయ మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, జెఎస్డబ్ల్యూ స్టీల్, టైటన్, రిలయన్స్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, నెస్ట్లే ఇండియా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లోకొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Stock Market Today: ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిష్టీ 18 పాయింట్లతో లాభపడి 19, 693 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 83.19 దగ్గర ట్రేడవుతోంది.

Translate this News:











