బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) కొన్నాళ్లుగా కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య మధ్య తీవ్ర వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ స్థానానికి రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరిని తమ అభ్యర్థిగా గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ప్రకటించడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) ఈ వివాదానికి తెర దించారు. మంత్రి సమక్షంలో తాజాగా జరిగిన చర్చల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధి కడియం శ్రీహరికి ఎమ్మెల్యే రాజయ్య తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అయితే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హామీతోనే రాజయ్య వెనక్కు తగ్గారని సమాచారం.
ఇది కూడా చదవండి: Car Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. వివరాలివే..!!
BRS Party: కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!

Translate this News:











