సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నానని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కానీ రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో 12, 13 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తుందన్న ఎంపీ.. రానున్న రోజుల్లో 12 గంటల విద్యుత్‌లో సైతం కోత విధించే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ సర్కార్ ఇచ్చే విద్యుత్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Komati Reddy Venkat Reddy: కేసీఆర్‌వి అన్నీ ఉత్తమాటలే.. 24 గంటల కరెంట్ ఎక్కడ.?
కేసీఆర్‌వి అన్నీగాలి మాటలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాట వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రలో 24 గంటల విద్యుత్ అందడంలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతులకు ఇప్పుడు విద్యుత్ అందకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు.

Translate this News:











