Spring fans in hostels: రాజస్థాన్ లో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఇందులో చాలా మంది స్టూడెంట్స్ హాస్టల్స్ లో ఫ్యాన్స్ కు ఉరి వేసుకుంటున్నారు. దీంతో హాస్టల్స్ యజమానులకు పెద్ద తలనొప్పిగా ఈ వ్యవహారం మారింది. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోను అదే పరిస్థితి ఉండడంతో సూసైడ్ లను అరికట్టడానికి ఏదో ఒకటి చేయాలని అధికారులు భావించారు.
పూర్తిగా చదవండి..Spring fans in hostels: స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆపడానికి హాస్టళ్ళలో స్ప్రింగ్ ఫ్యాన్లు..దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా!!
రాజస్థాన్ లో రోజురోజుకి పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు బ్రేక్ ఎలా వేయాలని అధికారులు ఆలోచనలో పడ్డారు. అయితే చాలా మంది ఫ్యాన్ కు ఉరి వేసుకొనే చనిపోతున్నారు. కాబట్టి ఆ ఫ్యాన్లకే ఏదో ఒకటి చేయాలని అధికారుల బుర్రకు తట్టింది. దీంతో ఓ గొప్ప ఐడియా వాళ్ళకు వచ్చింది. ఫ్యాన్లకే స్ప్రింగులు అమర్చితే పోలా.. అనుకున్నారు. ఇక తలనొప్పి వస్తే కడుపు నొప్పి బిళ్లా వేసుకున్నట్టు ఉన్న అధికారుల ఐడియా పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోతున్నారు.

Translate this News:











