Passport Drive : పాస్ పోర్ట్ సేవలను వేగంగా అందించేందుకు ఈనెల 14వ తేదీన ప్రత్యేక పాస్ పోర్టు డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజినల్ పాస్ట్ పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
పూర్తిగా చదవండి..Special Passport Drive : పాస్ పోర్టు కావాలా? ఈ పని చేస్తే వారంల్లోగా మీ చేతుల్లోకి…!!
పాస్ పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్ మెంట్ కోసం ఎంతోకాలం వేచి ఉండకుండా ఈ నెల 14వ తేదీని పాస్ పోర్టు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి దాసరి బాలయ్య పేర్కొన్నారు. బేగంపేట, అమీర్ పేట్, టోలిచౌకీ, నిజామాబాద్, కరీనంనగర్ లోని పాస్ పోర్టు సేవా కేంద్రాలు, భువనగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, వరంగల్ లోని పోస్టాపీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ తేదీ అపాయింట్ మెంట్స్ పాస్ పోర్టు వెబ్ సైట్లో త్వరలోనే విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

Translate this News:











