DK Aruna: స్పీకర్ తన కాల్ లిఫ్ట్ చేయడం లేదని మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. తనను హైకోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించినట్లు గుర్తు చేశారు. హైకోర్టు అందించిన ఆర్టర్ కాపీని అందించేందుకు ఎమ్మెల్యే రఘుననందన్ రావుతో కలిసి డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి (Pocharam Srinivas Reddy) గురువారం సాయంత్రం, ఇవాళ ఉదయం కాల్ చేసినట్లు తెలిపారు. స్పీకర్ తన కాల్‌ను లిఫ్ట్ చేయడం లేదని వెల్లడించారు. స్పీకర్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీ సైతం అందుబాటులో లేరని డీకే అరుణ వివరించారు. కాగా ప్రస్తుతం హైకోర్టు ఆర్డర్ కాపీని ఆఫీస్ స్టాప్‌కు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..DK Aruna: స్పీకర్ తన కాల్‌ను లిఫ్ట్ చేయడం లేదు
హైకోర్టు ఆర్డర్ కాపీతో డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఆర్డర్ కాపీని ఆమె అసెంబ్లీ సిబ్బందికి ఇచ్చినట్లు తెలిపారు. స్పీకర్ వెంటనే హైకోర్టు ఆర్డర్ కాపీని ఇంప్లిమెంట్ చేయాలని డీకే అరుణ కోరారు.

Translate this News:











