ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరిగిన ఫిఫా మహిళల వరల్డ్‌కప్-2023 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టుపై 1-0తో గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో స్పెయిన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తొలి నుంచి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. నువ్వా నేనా అంటూ ఆటగాళ్లు తలపడ్డారు. 29వ నిమిషంలో కెప్టెన్ ఓల్గా కార్మోనా గోల్ చేయడంతో స్పెయిన్ శిబిరంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. అనంతరం ఇంగ్లండ్ టీమ్ కూడా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అయినా కానీ అదృష్టం కలిసి రాలేదు. తొలి హాఫ్ పూర్తి కాగానే స్పెయిన్ 1-0తో ముందుంది. తర్వాత ప్రారంభమైన సెకండ్ హాఫ్‌లో ఇరు జట్లు గోల్ చేయడానికి పోటీపడ్డాయి. అయితే గోల్ చేయలేకపోయాయి. దీంతో స్పెయిన్ జట్టు విశ్వవిజేతగా అవతరించింది.
పూర్తిగా చదవండి..ఫిఫా మహిళల వరల్డ్‌కప్ విజేతగా స్పెయిన్
ఫిఫా మహిళల వరల్డ్‌కప్-2023 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టుపై 1-0తో గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో స్పెయిన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Translate this News:











