హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం (Hyderabad Ganesh Nimajjanam 2023) ఎంత వైభవంగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఓల్డ్ సిటీ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఘనంగా కొనసాగే మహాశోభయాత్రను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. అయితే.. శోభయాత్ర జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు పోలీసులు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద జరిగే గణేశ్ నిమజ్జన వేడుకను చూడడానికి వెళ్లడం ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఈ స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. ఆ ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..MMTS Special Trains: హైదరాబాద్ గణేశ్ భక్తులకు శుభవార్త.. నిమజ్జనం నాడు రాత్రంతా ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే
హైదరాబాద్ లో వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనం చూడాలనుకునే భక్తులకు దక్షిణ మధ్య శుభవార్త చెప్పింది. 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 4:40 గంటల వరకు స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Translate this News:











