VH About BC Garjana: తెలంగాణలో రోజు రోజుకూ ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మాత్రం సీట్లను ఒకే వర్గానికి అధికంగా కేటాయించవద్దని, సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (V Hanumantha Rao) గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. సీట్ల కేటాయింపులో బీసీ జనాభా ప్రతిపాధికన ఉంటుందన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..VH:త్వరలో బీసీ గర్జన కార్యక్రమం చేపడుతాం
తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించగా.. బీసీ ప్రతిపాధికన సీట్ల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు.

Translate this News:











