వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు కన్నతల్లిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో తల్లిని చంపిన నిందితుడు ఆ తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఖాసింపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అంజలమ్మ అనే మహిళకు (45) ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు సతీష్, చిన్న కొడుకు వెంకటేష్. వీరిద్దరికీ వివాహాలు కూడా అయ్యాయి. చిన్నకొడుకు వెంకటేష్ అదే ఊరికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఒక సొంత ఇంటిని వెంకటేష్ నిర్మించుకున్నాడు. మొదట తాండూర్లోని ఓ టిఫిన్ సెంటర్లో వెంకటేష్ పని చేసేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి పని చేసుకుంటూ తన జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే.. తల్లి అంజలమ్మ ఖాసింపూర్లోనే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana Crime: మద్యం మత్తులో కొడుకు ఘాతుకం… కన్నతల్లిని కడతేర్చిన కసాయి
కడవరకు తోడుండి కాటికి చితి పెట్టాల్సిన ఓ కొడుకు కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పులిచ్చిన వారికి సమాచారం ఇచ్చిందన్న కోపంతో తాగిన మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు ఓ శాడిస్ట్ కొడుకు.

Translate this News:











