విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండి దగ్గర జరిగిన ప్రమాదం దృష్ట్యా రైల్వే అధికారులు నేడు కొన్ని రైళ్ళను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ దారిలో ప్రధాన రైళ్ళయిన హౌరా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హౌరా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్, షాలిమార్- హైదరాబాద్ (18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. వీటితో పాటు విశాఖ-గుణుపుర్, విశాఖ-రాయగడ, విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంతో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Vizianagaram train accident:విజయనగరం రైలు ప్రమాదం-ఈరోజు కూడా పలు రైళ్ళు రద్దు
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత అక్కడి ట్రాక్ ను వెంటనే పునరుద్ధరించారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. నిన్నంతా కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు ట్రాక్ మరమ్మత్తు పనులు కూడా జరిగాయి. దీంతో ఆ దిశగా వెళ్ళే చాలా రైళ్ళను ఆపేసారు. మరికొన్నింటిని దారి మళ్ళించారు. ఈరోజు కూడా మరి కొన్ని రైళ్ళను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Translate this News:











